JEE Mains: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ-మెయిన్స్‌)-2025 11 month ago

featured-image

ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌ర్వాత ఇంట‌ర్‌లో ఎమ్‌పీసీ గ్రూప్ తీసుకున్న విద్యార్ధులు, బీటెక్ కెరీర్ ఆప్ష‌న్ గా ఎంపిక చేసుకున్న వారు, మంచి పేరున్న కళాశాల‌(ఎన్ఐటీ)ల్లో ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకున్న విద్యార్ధులు, దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను రాయ‌వచ్చు. ఈ ప‌రీక్ష‌ల‌లో మెరిట్ సాధించిన విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ల‌లో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. ఇందులో కూడా అర్హ‌త సాధించిన వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న‌టువంటి ఎన్ఐటీల్లో, ఐఐటీల‌లో చ‌దువుకోవ‌చ్చు.


దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22న, రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1న జరుగనున్నాయి. ఈ విషయాన్ని జాతీయ పరీక్షల సంస్థ (NTA) అక్టోబర్ 28న ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే, ఈసారి 40 రోజులు ఆలస్యంగా ప్రకటించారు. గతంలో జనవరి 24న ప్రారంభమైన పరీక్షలు, ఈసారి రెండు రోజులు ముందుకు జరగనున్నాయి. గతంలో కంటే భిన్నంగా, ఈసారి పరీక్షల ఫలితాల తేదీలను కూడా ప్రకటించడం విశేషం. గత ఏడాది జేఈఈ మెయిన్‌ పేపర్‌-1, 2కి దేశవ్యాప్తంగా 12.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 1.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదని సమాచారం.


జేఈఈ మెయిన్స్‌ ఎందుకంటే?

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీ జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుల ఆధారంగా జరుగుతుంది. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. జేఈఈ మెయిన్స్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. కొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా మరియు ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్‌ సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీల్లో 50% సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.


బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2, బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. బీఆర్క్‌కు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి, ఇది సాధారణంగా తొలి రోజు జరుగుతుంది. ఆ తర్వాత పేపర్‌-1 నిర్వహిస్తారు.


గత రెండేళ్ల మాదిరిగా ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-బిలో ఈసారి 5 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్‌ ఉండదు. రెండు సెక్షన్లలో మైనస్‌ మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు అయితే మైన‌స్ 1 త‌గ్గిస్తారు.


ఎన్‌టీఏ స్కోర్‌ కోసం తొలుత గణితం, తరువాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులకు స్కోర్ సమానంగా వచ్చినప్పుడు, తక్కువ మైనస్‌ మార్కులను పరిశీలిస్తారు.


జేఈఈ మెయిన్స్ పరీక్షను ఉదయం 9 నుండి 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు జరుగుతుంది. పరీక్షలు తెలుగు, ఆంగ్లం సహా 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరిన ప్రాంతీయ భాషలో కూడా అందించబడుతుంది. పేపర్-1  300 మార్కులకు గాను అలాగే పేపర్-2 400 మార్కులకు ఉంటుంది.


దరఖాస్తులో విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల మొబైల్ నంబరు, ఈ-మెయిల్ చిరునామా ఇవ్వాలి. ఎన్‌టీఏ ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని తెలిపింది.


ఛాయిస్ ఎత్తివేత

జేఈఈ మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి కొనసాగుతున్న సెక్షన్ బీ ఛాయిస్‌ను తొలగించారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా 32 ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేయబడతాయి. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు, ఒక్కో దానికి 4 మార్కులు, మొత్తం 300 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం నుండి 25 ప్రశ్నలు ఉంటాయి. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. 2021 నుండి జేఈఈ మెయిన్స్‌లో ప్రతి సబ్జెక్టులో 30 ప్రశ్నలు, మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో A, B సెక్షన్లు ఉంటాయి. A సెక్షన్‌లో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి, B సెక్షన్‌లో 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి, వీటిలో 5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఛాయిస్ ఉంటుంది. ఈసారి నుండి ఆ ఛాయిస్‌ను ఎన్‌టీఏ తొలగిస్తున్నట్లు ప్రకటించింది.


జేఈఈ మెయిన్స్ క‌ట్ ఆఫ్ మార్కులు

జేఈఈ మెయిన్స్ 2025 స్కోర్ అనేది భార‌త‌దేశంలోని వివిధ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి అభ్య‌ర్ధుల అర్హ‌త‌ను నిర్ణ‌యించే కీల‌క‌మైన స్కోర్‌. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 కి అర్హ‌త సాధించ‌డానికి అవ‌స‌ర‌మైన క‌నీస మార్కు క‌ట్ ఆఫ్‌. ప్ర‌తి సంవ‌త్స‌రం జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌లు ముగిసిన వెంట‌నే జేఈఈ మెయిన్స్ క‌టాఫ్ ప్ర‌క‌టించ‌బ‌డుతుంది.

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు బాధ్య‌త వ‌హిస్తుంది అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్స్ వెబ్‌సైట్‌లో ఫలితాల‌ను షేర్ చేస్తుంది. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్ధుల సంఖ్య, ప్ర‌శ్న‌ల క్లిష్ట‌త స్ధాయి మ‌రియు అభ్య‌ర్ధుల మొత్తం ప‌నితీరు వంటి అంశాల ఆధారంగా క‌ట్ ఆఫ్ శాతాలు మార‌వ‌చ్చు.


వివిధ వ‌ర్గాల‌కు క‌ట్ ఆఫ్ మార్కులు

ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన అభ్య‌ర్ధులు జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో వారి అప్లికేష‌న్ నంబ‌ర్, డేట్ ఆఫ్ బ‌ర్త్ ని న‌మోదు చేయ‌డం ద్వారా ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.


జ‌న‌ర‌ల్ అభ్య‌ర్ధుల‌కు 90 మార్కులు, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్ధుల‌కు 80 మార్కులు, ఓబీసీ నాన్ క్రిమీలేయ‌ర్ అభ్య‌ర్ధుల‌కి 76 మార్కులు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) కేట‌గిరీ వారికి 56 మార్కులు, షెడ్యూల్డ్ తెగ‌లు ఎస్టీ వారికి 47 మార్కులు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్ధుల‌కు 0.0031029 ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.


10 తర్వాత నర్సింగ్ కెరీర్... నర్సింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి?

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD