JEE Advance: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పూర్తి సమాచారం.! 1 y ago

featured-image

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తాజాగా విడుద‌ల చేసిన‌ షెడ్యూల్ ప్రకారం, 2025 మే 18వ తేదీన రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. మే 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష 2 పేపర్లతో ఉంటుంది. అభ్యర్థులు ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు సంవత్సరాలలో మాత్రమే 2 సార్లు ఈ పరీక్షను రాయవచ్చు.


జేఈఈ మెయిన్స్‌ 2025 ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన అభ్య‌ర్ధులు మాత్ర‌మే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హ‌త పొంద‌గ‌ల‌రు. సంవ‌త్స‌రంలో రెండు సార్లు నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్‌ ప‌రీక్ష‌లో అన్ని క్యాట‌గిరీల నుండి మొద‌టి రెండున్న‌ర‌ ల‌క్ష‌ల మంది ర్యాంక‌ర్ల‌ను మాత్ర‌మే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లో పాల్గొనాల‌నుకునే ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్దుల‌యితే 1995 అక్టోబ‌ర్ 1 తేదీ త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. మిగిలిన అభ్య‌ర్ధులు త‌ప్ప‌నిస‌రిగా 2000 అక్టోబ‌ర్ 1 వ తేదీ త‌ర్వాత జ‌న్మించిన వారై ఉండాలి.  ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ ప్ర‌ధాన స‌బ్జెక్టులుగా 2024, 2025 విద్యా సంవ‌త్స‌రాల్లో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి.


జేఈఈ అడ్వాన్డ్స్‌ రిజిస్ట్రేషన్ ఫీజు కొంచెం అధికంగా ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజు క్యాటగిరీల ప్రకారం వేరుగా ఉంటుంది. అన్ని క్యాటగిరీల్లో బాలికలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.1450, ఇతర అభ్యర్థులకు రూ.2900 చెల్లించాలి. సార్క్ దేశాల్లో పీఐఓ, ఓసీఐలతో పాటు విదేశీ విద్యార్థులు 90 డాలర్లు, సార్క్‌యేతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థులు 180 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఐఐటీ కాన్ పూర్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంతేకాక, పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలను కూడా ప్రకటించారు.


ఇది చదవండి: D.El.Ed. Program: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD