Kendhriya Vidyalaya: కేవీలో సీటు భవితకు భరోసా.. 1 y ago
కేంద్రీయ విద్యాలయాలు భారతదేశం అంతటా ఒకే విద్యా విధానాన్ని అనుసరిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యుత్తమంగా బోధిస్తాయి. విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దడం ఈ విద్యా సంస్థల ప్రత్యేకత.
1963లో కేవలం 20 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2023 నాటికి సుమారుగా 1,252 పాఠశాలలగా వస్తరించాయి. ఈ విద్యా సంస్థల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్స్, అధునాతన సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి. నైపుణ్యం గల ఉపాధ్యాయులలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో పాఠాలు బోధిస్తారు. చదువుతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వం, మానవత్వం పెంపొందించడం కేవీ ఉద్దేశం. మెరుగైన ఫలితాలు సాధిస్తూ.. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రత్యేక శిక్షణ, ఎలాంటి విపత్కర పరిస్థితి నైనా ఎదుర్కొనేలా శిక్షణ, దేశభక్తి భావనను కల్పించడమే లక్ష్యంగా విద్యా సంస్ధలు పనిచేస్తున్నాయి. నామ మాత్రం ఫీజు మాత్రమే తీసుకుంటారు.
ప్రవేశం పొందడం ఎలా..
కేంద్రియ విద్యాలయాల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. ఒకటో తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో, మిగిలిన తరగతులకు ఆఫ్‌లైన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫస్ట్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్ధి వయసు 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ను 100 మార్కులకు ఉంటుంది. హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. ఏ తరగతిలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. అంతకు ముందు తరగతిలో అర్హత సాధించి ఉండాలి.
రిజర్వేషన్లు ఇలా..
కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్స్ కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లలకు కల్పించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీ విద్యార్ధులకు రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ, నాన్-క్రిమీలేయర్ వారికి 27శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది. అయితే ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉండే ఉద్యోగుల పిల్లలకి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ వల్ల సరైన సమయానికి అడ్మిషన్స్ దొరక్కపోవడం వల్ల అకడమిక్ ఇయర్ కోల్పోయి.. సిలబస్ రీత్యా వెనకబడే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధిగ మించడానికి వీరికి ప్రాధాన్యం ఇస్తారు.
ప్రవేశానికి విపరీతమైన పోటీ...
అయితే కేవీలో అడ్మిషన్ దొరకడం అంత తేలిక కాదు. కొన్ని లక్షల దరఖాస్తులు వస్తుంటాయి. లాటరీ విధానంలో అడ్మిషన్స్ కేటాయిస్తారు. అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో క్యాటగిరీ వారీగా లాటరీ తీస్తారు. ఈ కమిటీలో ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్స్, పేరెంట్స్‌కి సంబంధించి ఒక ఫిమేల్ లేదా మేల్ పేరెంట్, కమిటీకి సంబంధించిన సభ్యులు ఉంటారు. ఇంకా ఖాళీలు ఉంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారిని పిలుస్తారు. వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది అనేది ఆన్లైన్లో మనం చెక్‌చేసుకోవచ్చు.
ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు..
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి స్టూడెంట్స్ ఆధార్, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, విద్యార్థి తల్లిదండ్రుల ఐడీ ఫ్రూఫ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, రెసిడెన్స్ సర్టిఫికేట్, విద్యార్ధి ఒకటో తరగతి కాకుండా మిగిలిన తరగతులకి అడ్మిషన్స్ కోరితే.. ముందు తరగతి మార్క్స్ షీట్, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు అయితే సర్వీస్ సర్టిఫికేట్, గార్డియన్ పిల్లలకు రిలేషన్ షిప్‌ని తెలిపే డాక్యుమెంట్ ఫ్రూఫ్ ఉండాలి.
ఉన్నత స్థితిలో విద్యార్థులు..
కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ పాఠశాలల్లో చదివిన పిల్లలు పెద్ద కంపెనీల్లో అత్యుత్తమ స్ధానాల్లో ఉన్నారు. కేవీల్లో దేశం నలుమూలల నుంచి పిల్లలు చేరడంతో అందులో చదివిన విద్యార్ధులకి హిందీ, ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు వస్తుంది. అంతేకాదు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో ఖచ్చితంగా కేవీ స్కూల్ పిల్లలుంటారు. పిల్లలు ఈ స్కూల్స్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంట్లో కూడా శ్రద్ధ తీసుకొని చదివిస్తే తప్పకుండా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు.