POLYCET: ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ 2 d ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో మార్చి 03 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత. దరఖాస్తు ఫీజు రూ. 400 (ఓసీ/బీసీ). ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ. 100. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 4. ఈ పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహిస్తారు. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.