DSC Preparation: డీఎస్సీలో నెగ్గాలంటే ప్ర‌ణాళికాబ‌ద్ద‌మైన ప్రిప‌రేష‌న్‌.! 9 month ago

featured-image

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించారు. కోచింగ్‌, స్వయంగా చదివేవారంతా ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నారు. అయితే, పుస్తకాలు, సబ్జెక్టులు ఎంపిక విషయంలో కొందరికి గందరగోళం నెలకొంది. నిపుణుల సూచనల ప్రకారం, రాష్ట్ర బోర్డు పుస్తకాలు, పాత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ టెస్టులు ఉపయోగించాలి. రోజువారీ టైమ్‌టేబుల్‌తో చదవడం, గ్రూప్ స్టడీ చేయడం, టెస్ట్ రివిజన్ అవసరం. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో చదివితే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందడం సాధ్యమేనని విద్యావేత్తలు అంటున్నారు.


ఉత్తమ ప్రిపరేషన్‌తో ఉన్నత మార్కులు సాధించి, గెలుపును చేరాలంటే క్రమబద్ధమైన, కఠినమైన ప్రిపరేషన్‌తోనే సాధ్యమని నిపుణుల సలహా. అందుకే, కొన్ని ముఖ్యమైన అంశాలు..


1. స్పష్టత : 

పరీక్షకు సిద్ధమయ్యే ముందు సిలబస్, షెడ్యూల్, పుస్తకాలు, పరీక్ష విధానం గురించి పూర్తిగా స్పష్టత ఉండాలి. పరీక్ష విధానం ప్రకారం ప్రణాళిక రూపొందించుకోవాలి. అవసరమైన మార్పులు చేర్పులు తెలుసుకోవాలి. సంబంధిత వెబ్‌సైట్‌లను సందర్శించి తాజా సమాచారం సేకరించాలి. సబ్జెక్ట్ ఫ్యాకల్టీని కలసి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అన్ని విషయాల్లో స్పష్టత ఉంటేనే సమర్థవంతమైన ప్రిపరేషన్ సాధ్యమవుతుంది. దీన్ని దశలవారీగా పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. క్రమశిక్షణతో ప్రిపరేషన్ చేయాలి.


2. ఎంచుకోవడం.. సిద్ధం చేసుకోవడం:

ప్రిపరేషన్ మొదలుపెట్టేముందు ముఖ్యవిషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రాధాన్యత కలిగిన టాపిక్స్‌ను గుర్తించి మొదట ప్రిపేర్ అవ్వాలి. సరైన పుస్తకాలు, కోచింగ్ సెంటర్, ప్రణాళికను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పాత ప్రశ్నాపత్రాలు, మోడల్ టెస్టులు చదవడం వల్ల పరీక్ష శైలిపై అవగాహన పెరుగుతుంది. సమయపాలనతో కూడిన ప్రిపరేషన్ ప్లాన్ తయారుచేసుకోవాలి. చదువు నాణ్యతపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ సమీక్ష చేసుకుంటూ ముందుకు సాగాలి. అసలు లక్ష్యం ఏమిటో మర్చిపోకుండా నిబద్ధతతో చదవాలి.


3. సమయ నిర్వహణ:

ప్రిపరేషన్‌కు ముందుగానే సమయాన్ని ప్లాన్ చేయడం అవసరం. ప్రతీ సబ్జెక్టుకు తగిన సమయాన్ని కేటాయించి, సులువు, కష్టమైన వాటిని పరిగణలోకి తీసుకోవాలి. మాక్ టెస్ట్ల‌లో స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు ఆన్స‌ర్స్ గుర్తించ‌డం లాంటివి ప్రాక్టీస్‌ చేయాలి.

ప్రతి రోజు ప్రతి సబ్జెక్ కి 2 గంటల సమయాన్ని కేటాయించాలి. ఒక సబ్జెక్టును 2 గంటలు చదివిన అనంతరం 15 లేదా 30 నిముషాలు బ్రేక్ తీసుకోవాలి.. తర్వాత మరో సబ్జెక్ట్ ను ఇంకో 2 గంటల పాటు చదవాలి.. ఇలా అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తే ఘన విజయం సాధిస్తారు. అలానే మరికొంత మంది కొన్ని సబ్జెక్టుల‌లో వెనుకుంటారు.. అలాంటి వారికి గ్రిప్ ఉన్న సబ్జెక్టుపై ఎక్కువ పట్టు సాధిస్తే.. ఆ సబ్జెక్టు ను అధిగమించవచ్చు. కానీ.. ప్రతి సబ్జెక్టు ను శ్రద్ధగా చదివితే.. రాని దంటూ ఏమి ఉండదని గ‌మ‌నించాలి.


4. ఆత్మ ప్రోత్సాహం: 

ఏ పరిస్థితిలోనైనా విశ్వాసాన్ని కోల్పోకండి. మిమ్మల్ని మీరే నమ్మండి. విజయానికి సిద్ధమవుతూ నిరంతరం ప్రిపరేషన్ కొనసాగించండి. జయానికి మార్గం ఓర్పు, పట్టుదల, ధైర్యం. సమయం కఠినంగా ఉన్నా, ఆశ చుట్టూ ఉన్నా, మన దారిని మలచేదే మన ఆత్మస్థైర్యం. ముందుకు సాగండి, విజయం మీదే. 


5. దృష్టి పెట్టాలి:

ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. చట్టాలు, చారిత్రక వార్తలు, విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత ముఖ్యమైనవి. బాలల అభివృద్ధి, అభ్యసన సిద్ధాంతాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై లోతైన అవగాహన అవసరం. ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు సాధించాలి. అర్థంకాని అంశాలను నిపుణుల సహకారంతో పరిష్కరించాలి. బోధనా పద్ధతులు అధ్యయనంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటన్నింటిపై ప్రాముఖ్యతతో కూడిన సన్నద్ధత విజయానికి దారితీస్తుంది.

జనరల్ నాలెడ్జ్: కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు.


కరెంట్ అఫైర్స్: జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్‌లు, క్రీడలు, అవార్డులు, గౌరవాలు, ముఖ్యమైన రోజులకు సంబంధించిన ప్రశ్నలు.


ఇంగ్లీష్: వ్యాకరణం, పదజాలం, పఠన గ్రహణశక్తి, రైటింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలు.


తెలుగు: వ్యాకరణం, పదజాలం, రీడింగ్ కాంప్రహెన్షన్, రైటింగ్ స్కిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు.


నిర్దిష్ట సబ్జెక్టులు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బ‌యాల‌జీ, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.


6. దృష్టి తప్పనిసరి: 

ప్రిపరేషన్ సమయంలో చదువు మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఇందుకోసం 6 లేదా 8 గంటల పాటు నిద్రపోవడం తప్పని సరి. అలానే ఆహార విషయంలో నిర్లక్ష్యంగా వహించరాదు. తగ్గిన పోష్టికాహారం తీసుకోవాలి. ఫోన్‌ కు దూరంగా ఉండాలి.. తల్లిదండ్రుల శ్రద్ధతో పాటు మనము జాగ్రత్త వ‌హించాలి. లక్ష్యాలు సాధించాలంటే ఆరోగ్యం అవసరం. ఆరోగ్యమే అసలైన సంపద. అది లేని చదువు, విజయం బలహీనమే.


7. ఇవి తప్పనిసరి: 

పరీక్షలు పూర్తి చేసుకునే వరకు అధికారిక వెబ్సైట్‌ని క్రమం తప్పకుండా సందర్శించాలి. ముఖ్యమైన వివరాలు, షెడ్యూల్, తేదీలు గమనించి నోట్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్ రాయడం ద్వారా, ప్రతి సబ్జెక్ట్‌కి ఎంత టైం పడుతుందో అర్ధం అవుతుంది. దీనితో, సబ్జెక్ట్‌లు ఎంచుకోవడం సులభం అవుతుంది. టైం సేవ్ చేయడం, పటిష్టమైన ప్రాక్టీస్ ఏర్పరచడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్ రాయడం మరింత సులభంగా, సమర్థవంతంగా అవుతుంది. ఇది అధ్యయనానికి, పరీక్షల నిర్వహణకు కూడా దోహదం చేస్తుంది. 


8. ముఖ్యమైన సూచనలు:

అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించడం వల్ల తాజా నోటిఫికేషన్లు, పరీక్షా తేదీలు, ఇతర ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు. సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు లేదా సీనియర్లతో చర్చించడం మంచిది. గ్రూప్ స్టడీస్ ద్వారా విజ్ఞానం పంచుకోవచ్చు, పరీక్షలపై మెరుగైన అవగాహన పొందవచ్చు. మాక్ టెస్ట్లు రాయడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ పెరుగుతుంది, నిజమైన పరీక్షకు సిద్ధంగా ఉండవచ్చు. క్రమశిక్షణ, సమయపాలన, సుస్థిరమైన అభ్యాసమే విజయానికి మంత్రం. 


ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, సరైన ప్రణాళిక అత్యంత అవసరం. ప్రతి రోజూ పద్ధతిగా చదవడం, సిలబస్‌ను విభజించి ప్రిపరేషన్ చేయడం, మాక్ టెస్టులు ప్రాక్టీస్‌ చేయడం వల్ల విజయాన్ని చేరుకోవచ్చు. ఈ విధంగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చదివితే త‌ప్ప‌క విజ‌యం సాధిస్తారు.



ఇది చదవండి: ఎల‌క్ట్రానిక్స్ బేస్‌తో ఐటీ రంగంలో కెరీర్ అవ‌కాశాలు!



Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD