TG-PGECET: టీజీ పీజీఈసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌....! 9 d ago

featured-image

తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేష‌న్‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ను జేఎన్‌టీయూహెచ్ (జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ హైద‌రాబాద్) నిర్వ‌హించ‌నుంది. బీఈ, బీటెక్, బీఫార్మ‌సీ ఉత్తీర్ణులైన అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.1100. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ. 600). ప‌రీక్షల‌ను కంప్యూట‌ర్ ఆధారిత విధానంలో , రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో నిర్వ‌హిస్తారు. నెగిటివ్ మార్కులు లేవు. మే 28 నుంచి 31 వ‌ర‌కు ఈ ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. అభ్య‌ర్ధులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేది మార్చి 2. పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD