SSC: టెన్త్ హాల్ టికెట్లు విడుదల 2 d ago
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (Board of Secondary Education-AP) పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లో పేరు, రోల్ నంబర్, ఫోటో, పరీక్షా కేంద్రం, షెడ్యూల్ వివరాలను సరిచూసుకొని, తప్పులుంటే వెంటనే పాఠశాల అధికారులకు తెలపాలి. ప్రైవేట్ అభ్యర్ధులు అధికారిక పోర్టల్ ఉంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఒకే షిఫ్టులో జరుగుతాయి. విద్యార్ధులు హాల్ టికెట్ల ను వెబ్సైట్ నుంచి పొందవచ్చు.