Tips for Relieving Stomach Pain: కడుపు నొప్పి తరచూ వస్తుందా? మీకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు! 1 y ago

featured-image

క‌డుపు నొప్పి ఉప‌శ‌మ‌నానికి కొన్ని చిట్కాలు..

 

అల్లం

అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల వల్ల కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంది అలా వచ్చినప్పుడు అల్లం మంచి పరిష్కారంగా మారుతుంది. అల్లం టీ తీసుకోవడం లేదా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

 


నడక

అజీర్ణం మరియు గ్యాస్ వల్ల కడుపు నొప్పి ఉంటే, కాసేపు నడవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకే చోట కూర్చునే బదులు, కాస్త వాకింగ్ చేయండి కడుపు నొప్పి కొంచెం తగ్గుతుంది.


దానిమ్మ జ్యూస్

కడుపు నొప్పితో బాధపడుతున్న వారు దానిమ్మ జ్యూస్ తాగితే, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.


జీలకర్ర నీరు

కడుపు నొప్పి ఉంటే, రాత్రి జీలకర్రను నీటిలో నానబెట్టుకుని, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.


వాము

గ్యాస్ మరియు ఎసిడిటీ ఉన్నవారు, వాము మరియు కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే, కడుపు నొప్పి తగ్గుతుంది.


తరచూ కడుపు నొప్పి వస్తుంటే, ఒకసారి డాక్టర్ని సంప్రదించడం ఉత్త‌మం. దీని ద్వారా నొప్పికి కారణాలను తెలుసుకుని మంచి చికిత్సను పొందవచ్చు. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించి స‌రైన చికిత్స‌ను అందిస్తారు.


 


గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.



వైరల్ ఫీవర్స్ కు దూరంగా ఉండాలి అంటే ఈ చిట్కాలు పట్టించండి...

చెవి నొప్పి ఉన్నపుడు ఈ చిట్కాలు ప్రయత్నించండి..

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD