RBI లో అసిస్టెంట్ పోస్టులు 17 d ago
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలలో ముంబయి 249, చెన్నై 53, కాన్పూర్ & లఖ్నవ్ 50, న్యూదిల్లీ 49, గువహటి 36, భోపాల్ 30, కోల్కతా 29, బెంగళూరు 24, అహ్మదాబాద్ 20, చంఢీగఢ్ 20, భువనేశ్వర్ 18, నాగ్పూర్ 17, పట్నా 17, జైపూర్ 11, హైదరాబాద్ 11, తిరువంతనంతపురం & కొచ్చి 10, జమ్మూ 6 మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత కనీసం 50% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్దులకు పాస్ మార్క్ సరిపోతుంది. వయసు 20 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 450/- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్ధులకు రూ. 50 తో పాటు జీఎస్టీ అదనం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 8. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయాలి.