D.El.Ed. Program: డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌ 11 month ago

featured-image

ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర్వాత బోధ‌న రంగానికి సంబందించిన శిక్ష‌ణ పొందాలంటే మీకు రెండు మార్గాలుంటాయి. మొద‌టిది రెండేళ్ల వ్య‌వ‌ధి ఉన్న డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యేకేష‌న్‌. రెండోది రెండేళ్ల వ్య‌వ‌ధి ఉన్న డిప్లొమా ఇన్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌. ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాంకు నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ గుర్తింపు తప్ప‌నిస‌రి. ఈ ప్రోగ్రాంలో ప్ర‌వేశానికి డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌లో మెరుగైన ర్యాంకు పొంది, ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. డిప్లొమా ఇన్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాంకు నేష‌న‌ల్ రిహాబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు అవ‌స‌రం. ఈ ప్రోగ్రాంలో ప్ర‌వేశం కోసం ఆలిండియా ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ర్యాంకు పొంది జాతీయ‌, రాష్ట్ర స్ధాయిల్లో ఉన్న వివిధ ఉపాధ్యాయ శిక్ష‌ణ సంస్ధ‌ల్లో ద‌ర‌ఖాస్తు చేయాలి. స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌లో ఇంట‌లెక్చువ‌ల్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ డెసెబిలిటీస్‌, విజువ‌ల్‌-హియ‌రింగ్ ఇంపెయిర్‌మెంట్ విభాగాలుంటాయి. వీటిలో న‌చ్చిన దాన్ని ఎంపిక‌చేసుకోవ‌చ్చు.


డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ సెట్‌:

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌తో డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ సెట్ లో ప్ర‌తిభ చూప‌డం ద్వారా ప్ర‌భుత్వ జిల్లా విద్యా శిక్ష‌ణ సంస్ధ‌లు (డైట్లు), ప్రైవేటు ఎలిమెంట‌రీ టీచ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ల‌లో ప్ర‌వేశించ‌వ‌చ్చు. రెండేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఈ కోర్సును దిగ్విజ‌యంగా పూర్తి చేసి, ఉన్న‌త‌మైన ఉపాధ్యాయ కొలువును సొంతం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో డీఈఈ సెట్ విధానం, ప‌రీక్ష‌లో విజ‌యానికి స‌బ్జెక్టు నిపుణుల సూచ‌న‌లు త‌దిత‌రాల‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు....

ప్ర‌భుత్వ డైట్‌లు, ప్రైవేటు ఎలిమెంట‌రీ టీచ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల‌లో డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ కోర్సులో ప్ర‌వేశానికి డీఈఈ సెట్ నిర్వ‌హిస్తారు. ప్ర‌స్తుతం సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాల‌ను డీఈఈ పూర్తిచేసిన అభ్య‌ర్ధుల‌తోనే భ‌ర్తీ చేస్తుండ‌టంతో ఈ కోర్సుకు డిమాండ్ ఏర్ప‌డింది. ఈ నేప‌ధ్యంలో పోటీ తీవ్రంగానే ఉండ‌నుంది. ఇందులో మంచి ర్యాంకు సాధిస్తే ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో సీటును చేజిక్కించుకోవ‌చ్చు.


విద్యార్హ‌త‌లు:

ఇంట‌ర్మీడియ‌ట్ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులు డీసెట్ రాసేందుకు అర్హులు. ఇంట‌ర్‌లో ఎస్సీ, ఎస్టీ, ఫిజిక‌ల్లీ చాలెంజ్డ్ అభ్య‌ర్ధులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఓసీ, బీసీ అభ్య‌ర్ధులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంట‌ర్‌లో వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన వారు డీఈఈ సెట్‌కు అన‌ర్హులు. 


ప‌రీక్షా విధానం:

డీసెట్ ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం మూడు భాగాలుగా ఉంటుంది. ప్ర‌శ్న‌ప‌త్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు చొప్పున 100 మార్కుల‌కు పేప‌ర్ ఉంటుంది. స‌మ‌యం రెండు గంట‌లు. పార్ట్‌-2, పార్ట్‌-3లోని ప్ర‌శ్న‌లు 8,9,10 త‌ర‌గ‌తుల స‌బ్జెక్టుల స్ధాయిలో ఉంటాయి. ప్ర‌శ్న‌ప‌త్రం తెలుగు/ఇంగ్లీష్‌, ఉర్దూ/ఇంగ్లీష్ మాధ్య‌మాల్లో ఉంటుంది. 


పార్ట్‌-1

జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుండి 5 ప్ర‌శ్న‌లు, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 5 ప్ర‌శ్న‌లు మొత్తం 10 మార్కుల‌కు ఉంటుంది.


పార్ట్‌-2

జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్ నుంచి 10 ప్ర‌శ్న‌లు, తెలుగు/ఉర్దూ/త‌మిళం నుంచి 20 ప్ర‌శ్న‌లు మొత్తం 30 మార్కుల‌కు ఉంటుంది.


పార్ట్‌-3

మ్యాథ‌మెటిక్స్ నుంచి 20 ప్ర‌శ్న‌లు, ఫిజిక‌ల్ సైన్స్ నుంచి 10 ప్ర‌శ్న‌లు, బ‌య‌లాజిక‌ల్ సైన్స్ నుంచి 10 ప్ర‌శ్న‌లు, సోష‌ల్ నుంచి 20 ప్ర‌శ్న‌లు మొత్తం 60 మార్కుల‌కు ఉంటుంది. ఓవ‌రాల్‌గా మూడూ పార్టులు క‌లిపి 100 మార్కుల‌కు ఉంటుంది.


ప్ర‌వేశ ప‌రీక్ష‌లో క‌నీస అర్హ‌త మార్కులు సాధించిన వారికి మాత్ర‌మే ర్యాంకులు కేటాయిస్తారు. ఓసీ, బీసీ అభ్య‌ర్ధులు క‌నీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్య‌ర్ధుల‌కు అర్హ‌త‌ మార్కులు లేవు. 85 శాతం సీట్ల‌ను స్ధానిక అభ్య‌ర్ధుల‌కు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్‌రిజ‌ర్వ్‌డ్ సీట్లు.

ఇంట‌ర్ త‌ర్వాత టీచింగ్ వృత్తిలో స్ధిర‌ప‌డాల‌నుకునే వారికి ఇదొక మంచి అవ‌కాశం. డైట్ సెట్ చేసిన వారు ప్రైవేట్ స్కూళ్ల‌లోనూ టీచ‌ర్‌గా రాణించ‌వ‌చ్చు. ఈ విద్యార్హ‌త‌తో ప్ర‌భుత్వం వారు ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో డీఎస్సీ నోటిఫికేష‌న్ ద్వారా టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. డీఎస్సీలో మంచి స్కోరు సాధిస్తే గ‌వ‌ర్న‌మెంట్ టీచర్‌గా స్ధిర‌ప‌డ‌వ‌చ్చు.


ఇది చదవండి: ఇంట‌ర్ త‌ర్వాత ఫ్యాష‌న్ టెక్నాల‌జీ!

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD