Gurukul Schools: గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియలు 1 y ago
1.ఏపీ ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ!
ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఆరోతరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఏకలవ్య గురుకుల పాఠశాలల్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1,680 సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి.
ప్రవేశాలు
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఆరోతరగతికి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ (50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్ (25 ప్రశ్నలు), లాంగ్వేజ్ (తెలుగు-25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రవేశాలు రాతపరీక్ష, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు రాయడానికి ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్ధులు అర్హలు. ఒక్కో స్కూల్‌లో 60 సీట్లు (బాలురకు 30, బాలికలకు 30) ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ లో బోధన ఉంటుంది. పూర్తి వివరాలకు https://twreis.apcfss.in/ ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపికైన విద్యార్ధులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2.విజయవాడలోని సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధ
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో ప్రతీ ఏటా అయిదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్‌లాగ్ (ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటనను విడుదల చేస్తుంది.
అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
మహాత్మ జ్యోతిబాపులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.
విద్యార్హత సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. అభ్యర్ధుల వయసు ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్ధులు 11 ఏళ్ల మధ్య ఎస్సీ/ ఎస్టీ విద్యార్ధులు 12 ఏళ్ల మధ్య ఉండాలి. ఆదాయం విద్యార్ధి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదు. ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు (15 మార్కులు), ఇంగ్లీష్ (25 మార్కులు), గణితం (30 మార్కులు), పరిసరాల విజ్ఞానం (30 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్ధాయిలో ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా కేంద్రం విద్యార్ధుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక విధానం అర్హులైన అభ్యర్ధులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజు 100.
ప్రవేశాలు
జూనియర్ ఇంటర్మీడియట్, 5వ తరగతి, బ్యాక్‌లాగ్ (6,7,8,9) తరగతుల్లో ప్రవేశాలు. విద్యార్హతలు, వయస్సు, ప్రవేశ పరీక్ష విధానం, సీట్ల సంఖ్య, పరీక్ష కేంద్రం, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము తదితర వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్ https://mjpapbcwreis.apcfss.in/ లో చూడగలరు.
3. డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో !
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురకుల విద్యాలయాల సంస్ధ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా. బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఐదో తరగతి, ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి బీఆర్ఏజీ సెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్‌లో మార్చి 6వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్ధుల ఎంపిక ప్రక్రియ బీఆర్ఏజీ ఎంట్రన్స్ టెస్ట్-2025 ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతుంది. విద్యార్హత ఐదో తరగతి అయితే జిల్లాలోని ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో మూడో తరగతి 2024-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధిత జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
ఐఐటీ నీట్ కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలకు బీఆర్ఏజీ సెట్ (జూనియర్ ఇంటర్) పరీక్ష మెరిట్ జాబితాలో ర్యాంక్ పొందిన విద్యార్ధులు ఐఐటీ మెడికల్ అకాడమీల పరీక్షకు 1ః3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
వయస్సః ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్ధి వయస్సు ఎస్సీ/ ఎస్టీ విద్యార్ధులు 01.09.2012 నుంచి 31.08.2016 మధ్య, ఓసీ/ బీసీ/ బీసీ-సి విద్యార్ధులు 01.09.2014 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.
1.ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్ధులు 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
2.ఆదాయ పరిమితిః విద్యార్ధి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 1,00,000 మించకూడదు.
3.రిజర్వేషన్ల వివరాలుః ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు.
4.ఎంపిక విధానం ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం-15, ఇంగ్లీష్-10, తెలుగు-10, ఈవీఎస్-15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం-15, ఫిజికల్ సైన్స్-15, బయాలజీ/ నేచురల్ సైన్స్-15, సామాజిక అధ్యయనాలు-10, ఇంగ్లిష్-15, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్-30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 6. పూర్తి వివరాలకు https://apbragcet.apcfss.in/ ఇక్కడ క్లిక్ చేయండి.
జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో అడ్మిషన్ ప్రక్రియ